పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన తర్వాతే ప్రధాని మోదీ తెలంగాణ గడ్డపై అడుగు పెట్టాలి

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య    కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని గెలిపిస్తే 'పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాని'కి జాతీయ హోదా కల్పిస్తామని 2014 ఎన్నికల ప్రచార సభలో ఇచ్చిన హామీని ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే నిలబెట్టుకోవాలని తెలంగాణ రక్షణ సేన రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి డిమాండ్ చేశారు.   కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ.. ఆయన బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014లో మహబూబ్ నగర్ లో జరిగిన ఎన్నికల సభలో నాటి ఎన్డీయే...