మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం త్వరితగతిన పూర్తి చేసి, మన బీడు భూముల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కాలన్న సంకల్పంతో తెలంగాణ రక్షణ సేన వ్వవస్థాపక అధ్యక్షురాలు తలపెట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభ కు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని తెలంగాణ రక్ణణ సేన రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి పిలుపునిచ్చారు.
గురువారం చౌదర్ గూడ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించే పాలమూర్ – రంగారెడ్డి ప్రాజెక్ట్ సాధన సభా స్థలిని గురువారం ఆయన రాష్ట్ర మైనారిటీ విభాగం అధ్యక్షుడు మహమ్మద్ ముస్తఫా, నారాయణ్ పేట్ అధ్యక్షుడు గవినోళ్ళ శ్రీనివాస్, షాద్‌నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ చీమల రమేష్, సమన్వయ కర్తలు చిలుక ప్రవీణ్ , శీలం వీరెందర్, చామర్తి శీతారామ్, నాయకులు శ్యామ్, శ్రవణ్ గౌడ్, శివరామకృష్ణా రెడ్డి తదితరులతో కలిసి పరిశీలించారు . అనంతరం విలేఖరులతో వారు మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు ఈ మహాసభ ఒక కీలక ఘట్టం. ఈ సభను విజయవంతం చేయడానికి సమాజంలోని ప్రతి వర్గం కదలి రావాలన్నారు. ఎండిన బీడు భూములను సస్యశ్యామలం చేసి, మన బతుకులను పచ్చగా మార్చేది సాగునీరే అని తెలిపారు. మన పొలాలకు దక్కాల్సిన నీటి వాటా కోసం, భవిష్యత్తు తరాల కోసం మీరంతా ఏకమై ఈ సభలో గొంతు కలపాలన్నారు. తెలంగాణ ఉజ్వల భవిష్యత్తుకు యువతే వెన్నెముక అన్నారు. ప్రాజెక్టు పూర్తయితేనే ఈ ప్రాంతం వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చెంది, ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయన్నారు. నవసమాజ నిర్మాణానికి మార్గదర్శకం కావాలని పిలుపునిచ్చారు.
మహిళలకు తాగునీటి గోస తీరాలన్నా, ప్రతి ఇంట సిరి సంపదలు వెల్లివిరియాలన్నా ఈ ప్రాజెక్టు ఎంతో అవసరమని ఆయన చెప్పారు. మన నీటి హక్కు మన భవిష్యత్తు, మన బాధ్యత. నీటి కోసం మనమంతా ఒక్కటై పోరాడుదాం. సభను విజయవంతం చేద్దామన్నారు.