పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుడిపై భారం మోపడం సరికాదు

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య  అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదలను సాకుగా చూపుతూ, చమురు సంస్థలు సామాన్యుడిపై మరోసారి ధరల భారాన్ని మోపడం అత్యంత బాధాకరం. ఐదు రోజుల వ్యవధిలోనే రెండోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంపై రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత శుక్రవారం (మే 15) లీటరుకు రూ. 3 పెంచిన చమురు సంస్థలు, ఆ గాయం మానక ముందే...