పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే న్యాయం

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య : పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. మహేశ్వరం, సుభాన్ పూర్, మాణిక్యమ్మగూడ, చిన్నతూర్ప, డబిల్ గూడ గ్రామాల్లోని ఇందిరమ్మ లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదోడికి కూడు, గూడు కల్పించేది నాటి నుంచి నేటి వరకు ఇందిరమ్మ రాజ్యంలోనే అని పేర్కొన్నారు. పేదలకు కూడు (ఆహార భద్రత), గూడు (ఇందిరమ్మ ఇళ్లు) సమకూర్చడమే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలను...