మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
పేదల పెన్నిధి దేశానికి సాంకేతికతను తీసుకువచ్చింది మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధేనని ఉమ్మడి శ్రీరామకృష్ణాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న గణేష్ నేత అన్నారు. ఉమ్మడి శ్రీరామకృష్ణాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న గణేష్ నేత ఆధ్వర్యంలో భారత రత్న,మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ 35 వ వర్ధంతి వాసవి కాలనీ బీఎన్ఆర్ వైష్ణవి అపార్ట్మెంట్ ఎన్టీఆర్ నగర్ చౌరస్తా వద్ద రాజీవ్ గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం మొత్తం కన్నీరు పెట్టించిన ఆ దుర్దినం మన దేశ చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని రోజు అని అన్నారు. రాజీవ్ గాంధీ యువ ప్రధానిగా దేశానికి కొత్త దిశ చూపించారని, ఆయన కళ్ళలో ప్రేమ, మాటల్లో మృదుత్వం, వ్యక్తిత్వంలో హుందాతనం స్పష్టంగా కనిపించేవన్నారు. తల్లి ఇందిరా గాంధీ హత్య అనంతరం దేశం కష్టాల్లో ఉన్న సమయంలో బాధను జీర్ణించుకుని ప్రజలను ఏకం చేసి దేశ పునర్నిర్మాణానికి ఆయన కృషి చేశారని గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం మే 21ను ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తూ, ఆయన త్యాగాన్ని స్మరించుకుంటూ, భౌతికంగా మనతో లేకపోయినా, ఆయన చూపిన మార్గం, ఆశయాలు మనకు ఎల్లప్పుడూ ప్రేరణగా నిలుస్తాయని. ఆయన కలల భారతదేశ నిర్మాణానికి మనం అందరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిలుక ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ కన్వినర్, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావ్, ఖిల్లా మైసమ్మ టెంపుల్ చైర్మన్ సురేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముప్పిడి లింగస్వామి గౌడ్, మహమ్మద్, యాదవ రెడ్డి, రామకృష్ణ గౌడ్, పగడాల ఎల్లన్న , పెద్ద ఊర సైదులు, బొడ్డుపల్లి మహేందర్ , పగడాల శ్రీశైలం, పొట్టబత్తిని నగేష్, గుణగంటి రమేష్ గౌడ్, దోర్నాల చంద్రమౌళి, సందీప్, పొద్దుటూరు శ్రీనివాస్,రాజు నాయక్, ప్రేమ్ నాయక్, నరసింహ, శ్రీనివాస్ గౌడ్, యాదయ్య, నాను నాయక్, జహంగీర్, విప్లవ్ రెడ్డి, నగేష్ , సలీం, ఢల్లీ ,పటేల్, టైగర్ శివ తదితరులు పాల్గొన్నారు.