MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 25 June 2026, 8:13 pm Posted by : MANA TOLIVELUGU

పేద విద్యార్థి ఉన్నత చదువుకు అండగా శ్రీ ఎస్పీఆర్ ట్రస్ట్ 

ఎంబీబీఎస్ పట్టా అందుకున్న విద్యార్ధిని చూస్తే చాలా ఆనందంగా ఉంది

సొంటిరెడ్డి పున్నారెడ్డి

మన తొలివెలుగు కుత్బుల్లాపూర్ ప్రతినిధి టి రమేష్ :

ఎంబీబీఎస్ చదవాలనే పేద విద్యార్థి రమేష్ కోరికను శ్రీ ఎస్పీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ సొంటిరెడ్డి పున్నారెడ్డి నెరవేర్చారు. దాదాపుగా 5 లక్షల రూపాయల ఖర్చుతో పేద విద్యార్థి ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి సహాయం అందించారు. రమేష్ ది నిరుపేద కుటుంబం. ఇతను చదువులో బాగా రాణిస్తున్నా.. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం. దీంతో అతను ఎంబీబీఎస్ చదవాలన్న ఆశను వదులుకునే ప్రయత్నంలో శ్రీ ఎస్పీఆర్ ట్రస్ట్ చైర్మన్ సొంటి రెడ్డి పున్నారెడ్డి విషయం తెలుసుకొని రమేష్ ను ట్రస్టు ద్వారా దత్తత తీసుకున్నాడు. ఐదు సంవత్సరాల పాటు సొంత ఖర్చులతో చదివించడంతో ప్రస్తుతం రమేష్ ఎంబీబీఎస్ పూర్తి చేసి బుధవారం పున్నారెడ్డి ఆశీర్వాదం తీస్తున్నాడు.

ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. తాను ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి తన వంతు సహాయంగా ప్రతి నెలలో వచ్చే వేతనంలో కొంత అందిస్తానని చెప్పి పూర్తి సహాయ సహకారాలు అందించిన సొంటి రెడ్డి పున్నారెడ్డి తన కలలను నెరవేర్చాడని ఆనందం వ్యక్తం చేశాడు. సొంటి రెడ్డి పున్నారెడ్డి ఆశీస్సులతో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరి వారి ఆశయాలను నెరవేరుస్తానని తెలిపారు. శ్రీ ఎస్పీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ సొంటిరెడ్డి పున్నారెడ్డి మాట్లాడుతూ.. తాను చేసిన చిన్న సహాయం వల్ల కొందరి జీవితంలో గొప్ప ఫలితాలు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. రానున్న కాలంలో ఎస్పీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరిన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు.