MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 5:58 pm Posted by : MANA TOLIVELUGU

పోచమ్మ గుడిలో.. సమాధులను తలపిస్తున్న శిలాఫలకాలు 

మన తొలివెలుగు యాదాద్రి భువనగిరి జిల్లా రిపోర్టర్ జంగిటి రవీందర్ : 

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైనా బోనాల పండుగ సమీపిస్తున్న వేళ భువనగిరి హనుమాన్ వాడ పోచమ్మ దేవాలయంలో అభివృద్ధి పేరుతో వెలసిన శిలాపలకాలు సమాధులను తలపిస్తున్నాయి. ఆలయ అభివృద్ధి పేరుతో నిర్మిస్తున్న శిలాఫలకాలు భక్తులకు ఇబ్బందులను తెచ్చి పెట్టేలా ఉన్నాయి. బోనాలలో భక్తుల రద్దీకి ఇవి ఆటంకిగా మారనున్నాయి. గుడిని అభివృద్ధి చేసింది గోరంతయితే .. ప్రచారం కొండంత.. అనే పేరుతో పోటాపోటీగా ఏర్పాటు చేస్తున్న శిలాఫలకాలు తొలగించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా శిలాఫలకాలు ఏర్పాటు చేయడంపై సర్వత్ర చీదరింపులు విమర్శలు ఎదురవుతున్నాయి.