ప్రకృతి మన జీవితంలో భాగం – దానిని కాపాడుకుందాం 

డిప్యూటీ కమిషనర్ వెంకట్రావు మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మన భవిష్యత్తు భద్రంగా ఉంటుందని, అకాల వర్షాలు, తీవ్రమైన వేడిగాలులు ప్రకృతి విధ్వంసానికి సంకేతాలని జల్ పల్లి మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్ వెంకట్రావు అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 65వ వార్డులోని జల్ పల్లి ప్రభుత్వ స్కూల్ లో డిప్యూటీ కమిషనర్ వెంకట్రావు మొక్కలు నాటి నీరు పోశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగానే కాకుండా సమయం కుదిరినప్పుడల్లా ప్రతి ఒక్కరూ...