MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 8:00 pm Posted by : MANA TOLIVELUGU

ప్రకృతి మన జీవితంలో భాగం 

దానిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :

ప్రకృతిని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. ప్రకృతిని కాపాడుకోవడం అంటే మన భవిష్యత్తు తరాలకు ప్రాణవాయువును, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే. జూన్ 5న మాత్రమే కాకుండా, ప్రతిరోజూ పర్యావరణ పరిరక్షణను ఒక బాధ్యతగా భావించాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బద్దం మహిపాల్ రెడ్డి, మహేశ్వరం అసెంబ్లీ ఇంచార్జి అందెల శ్రీరాములు యాదవ్ పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్ సూచనలు ఆదేశాల మేరకు 12 సంవత్సరాల మోదీ ప్రభుత్వ విజయోత్సవాల, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం మీర్ పేట్ డివిజన్ లోని మంత్రాల చెరువు దగ్గర మీర్ పేట్ అధ్యక్షుడు తులసి ముకేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో “ఏక్ పెడ్ మా కే నామ్” వృక్షారోపణ, మొక్కలు నాటే కార్యక్రమం, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వారు విచ్చేసారు. మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి, అందెల శ్రీరాములు మాట్లాడుతూ.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ప్రధాని నరేంద్ర మోదీ 12 సంవత్సరాల ప్రభుత్వం పూర్తి చేసుకున్న సందర్భంగా మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఒక మొక్కని నాటాలని కోరారు. ప్రకృతి మన జీవితంలో భాగమని, దానిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని తెలిపారు. ప్రకృతి మానవుడికి అవినాభావ సంబంధం ఉందన్నారు. మనిషి ప్రకృతిలో పుట్టి, ప్రకృతిలోనే పెరుగుతాడు. శ్వాసించే గాలి, తాగే నీరు, తినే ఆహారం అన్నీ ప్రకృతి ప్రసాదించినవే. అయితే, నేటి ఆధునిక కాలంలో స్వార్థం కోసం ప్రకృతిని, పర్యావరణాన్ని నాశనం చేయడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని ప్రతి ఒక్కరుకూడా వీలైనప్పుడల్లా చెట్లని నటి మన ప్రకృతిని కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గుప్తా , రాష్ట్ర నాయకులు శంకర్ రెడ్డి , జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ రెడ్డి , జిల్లా నాయకులు మల్లారెడ్డి , కార్యదర్శులు విజయ్ లక్ష్మీ రాజు , నీలా రవి నాయక్ , ప్రశాంతి హిల్స్ అధ్యక్షుడు బిక్షపతి చారి, నాదర్ గూల్ డివిజన్ అధ్యక్షుడు వీర కర్ణా రెడ్డి, అన్ని డివిజన్లలోని మాజీ అధ్యక్షులు, మాజీ ప్రజా పతినిదులు, జనరల్ సెక్రటరీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.