MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 29 April 2026, 12:29 pm Posted by : MANA TOLIVELUGU

ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి 

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు బడంగ్పేట్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. మీర్‌పేట్ 60వ డివిజన్ పరిధిలో ఆయన అధికారులతో కలిసి పర్యటించారు. త్రివేణి నగర్, రెడ్డి టిఫిన్స్ మెయిన్ రోడ్, టీఆర్‌ఆర్ టౌన్‌షిప్ ప్రాంతాలను సందర్శించి, స్థానిక సమస్యలు, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల పరిస్థితులను సమీక్షించారు. పర్యటనలో భాగంగా రోడ్ల పరిస్థితి, కాల్వల శుభ్రత, చెత్త సేకరణ విధానం, తాగునీటి సరఫరా వంటి అంశాలను అధికారులు పరిశీలించారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కాలనీ , బస్తీ వాసులు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా నిర్దిష్ట ప్రదేశాల్లోనే వేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు ప్రత్యేకంగా పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలన్నారు. అలాగే రోడ్ల మరమ్మతులు, కాల్వల శుభ్రత పనులను వేగవంతం చేయాలని సూచించారు. అధికారులు ఇలాంటి పర్యటనలను నిరంతరం కొనసాగిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత విభాగాల అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.