ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి 

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య  ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు బడంగ్పేట్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. మీర్‌పేట్ 60వ డివిజన్ పరిధిలో ఆయన అధికారులతో కలిసి పర్యటించారు. త్రివేణి నగర్, రెడ్డి టిఫిన్స్ మెయిన్ రోడ్, టీఆర్‌ఆర్ టౌన్‌షిప్ ప్రాంతాలను సందర్శించి, స్థానిక సమస్యలు, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల పరిస్థితులను సమీక్షించారు. పర్యటనలో భాగంగా రోడ్ల పరిస్థితి, కాల్వల శుభ్రత, చెత్త సేకరణ విధానం, తాగునీటి సరఫరా వంటి అంశాలను అధికారులు పరిశీలించారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి...