MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 10:12 pm Posted by : MANA TOLIVELUGU

ప్రజలు స్వీయ గణనను వినియోగించుకోవాలి

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

మే 11వ తేదీ నుండి జూన్ 9 తేదీ వరకు జరిగే జన గణన లో భాగంగా ప్రజలు స్వచ్ఛందంగా తమ వివరాలను మే 10వ తేదీ వరకు నమోదు చేసుకోవాలి అని జల్పల్లి సర్కిల్ ఛార్జ్ ఆఫీసర్, డిప్యూటీ కమిషనర్ వెంకట్ రామ్ ప్రజలను కోరారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ తమ కుటుంబ వివరాలను సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానం లో పూర్తి చేయడం జరిగింది..

జనాభా గణన లో భాగంగా డిప్యూటీ కమిషనర్  

సెల్ఫ్ ఎన్యుమరేషన్ కి సంబంధించిన

స్టెప్ బై స్టెప్ విధానం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ https://se.census.gov.in

Self Enumeration (HLO) Login వద్ద తెలంగాణ ఎంపిక చేసి, క్యాప్చా ఎంటర్ చేసి వెరిఫై అండ్ ప్రాసెస్డ్ క్లిక్ చేయాలి అన్నారు. వెల్కమ్ పేజీలో కుటుంబ పెద్ద పేరు, మొబైల్ నంబర్ నమోదు చేయాలన్నారు. ఒక కుటుంబానికి ఒకే మొబైల్ నంబర్ ఉపయోగించాలన్నారు. వచ్చిన ఓటిపి ఎంటర్ చేసి వెరిఫై అండ్ ప్రాసెస్డ్ క్లిక్ చేయాలన్నారు. తరువాత మీకు నచ్చిన భాషను ఎంచుకోవాలన్నారు.

మీ జిల్లా, పట్టణం, గ్రామం, పిన్ కోడ్ వివరాలు నమోదు చేయాలన్నారు. మొబైల్ లో లొకేషన్ ఆన్ చేసి, మీ ఇంటి వద్ద రెడ్ మార్క్ సెట్ చేయాలన్నారు. ఇళ్ల వివరాలకు సంబంధించిన 33 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, రివ్యూ ద్వారా చెక్ చేసి సబ్మిట్ చేయాలన్నారు. సబ్మిట్ చేసిన అంతరం తరువాత హెచ్ తో ప్రారంభమయ్యే 11 అంకెల ఎస్ ఈ ఐడి ఐడి వస్తుందని తెలిపారు. దాన్ని స్క్రీన్‌షాట్ లేదా నోట్ చేసుకుని భద్రపరచుకోవాలన్నారు. మే 11 తరువాత మీ ఇంటికి వచ్చే గణన అధికారికి ఈ ఎస్ ఈ ఐ డి చూపిస్తే వారు అప్రూవ్ చేస్తారని తెలిపారు.

మన బాధ్యత – మన సమాచారం స్వయంగా నమోదు చేసి సమయాన్ని ఆదా చేసుకుందామని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ వినయ్ కుమార్, టెక్నికల్ అసిస్టెంట్ నవీన్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు