ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి

సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి కలెక్టరేట్ ఎదుట సీపీఐ ధర్నా మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి టౌన్ ప్రతినిధి జంగిటి రవీందర్ : యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం సీపీఐ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు వందలాది మందితో ధర్నా నిర్వహించిన అనంతరం...