ప్రజావాణిలో గోషామహల్ సమస్యలపై వినతి పత్రం 

ఆక్రమణల తొలగింపు, నాలాల శుద్ధీకరణకు డిమాండ్ మన తొలివెలుగు, తెలంగాణ బ్యూరో రిపోర్టర్ కనుగుల సాయికిషోర గోషామహల్ నియోజకవర్గ పరిధిలో నెలకొన్న పలు ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ప్రజావాణి సందర్భంగా జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. గోషామహల్ నియోజకవర్గంలోని ఏడు డివిజన్ లలో కచ్చా మొరీల పూడికతీత పనులు చేపట్టాలని, నాలాల డీ-సిల్టింగ్ పనులను వేగవంతం చేయాలని కోరారు. అలాగే జీహెచ్‌ఎంసీ సర్కిల్-30, 35 పరిధిలోని ఫుట్‌పాత్‌లపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి...