సబితా ఇంద్రారెడ్డి గెలిచినప్పటి నుండి నియోజకవర్గము ప్రజలకు లేవు కడగండ్లు, కన్నీళ్లు
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తూ నిరంతరం ప్రజల మధ్యలో ఉండి పని చేసే గొప్ప నాయకురాలు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అని మాజీ సోషల్ మీడియా వారియర్, మాజీ సైనికుడు కాట్రగడ్డ వాసు బాబు అన్నారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని కలిసి ఆయన నియోజకవర్గ అభివృద్ధిపై , ప్రజలకు అందాల్సిన మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. ఈ సందర్భంగా వాసు బాబు మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం సబితా ఇంద్రారెడ్డి ప్రతి సంక్షోభాన్ని సవాల్ గా తీసుకొని ప్రజల్లోకి వెళ్లారని జననీరాజనాలు అందుకున్నారని పేర్కొన్నారు. అయితే గెలవగానే ఆమె నియోజకవర్గాన్ని, ప్రజలను ఎన్నడు విస్మరించలేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టారన్నారు. పేదల సంక్షేమాన్ని ప్రాధాన్యతా రంగంగా మార్చుకున్నారు. అందుకనే నియోజకవర్గంలోని పేద రోగులకు దాదాపు లక్షల కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ నుండి సాయం అందేలా చొరవ చూపారన్నారు . అర్హులైన అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చేశారన్నారు. యువతకు ఉపాధి కల్పించేందుకు జాబ్ మేళాలు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. .అనునిత్యం నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిగా సబితా ఇంద్రారెడ్డి మారిపోయారు అన్నది వాస్తవమన్నారు. అలాగే అధికారంలో అయినా ప్రతిపక్షంలో అయినా ప్రభుత్వ పరంగా అన్ని శాఖలకు అభివృద్ధి ప్రతిపాదనలు పంపి నిధులు మంజూరు చేయించుకుని అభివృద్ధి చేస్తారని తెలిపారు. ముఖ్యముగా నియోజకవర్గం అభివృద్ధి పై ఫోకస్ పెట్టారు. పల్లెల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. వాట్ నాట్.. అందరి చేత సబితా ఇంద్రారెడ్డి వండర్ఫుల్ అనిపించుకుంటున్నారని అన్నారు. ఇప్పటికైతే నియోజకవర్గము వ్యాప్తంగా సబితా ఇంద్రారెడ్డి పట్ల సానుకూల స్పందన వ్యక్తం అవుతుందనీ కొన్ని విమర్శలు వినిపిస్తున్నప్పటికీ వాటిని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. సబితా ఇంద్రారెడ్డి ని అప్రతిష్టపాలు చేసే కుట్రలు ఫలించడం లేదన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే పనితీరు అనితర సాధ్యమైనది. రాజకీయాలకు అతీతమైనదని తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కడైనా ప్రజలకు తీవ్ర సమస్య ఉందని తెలిస్తే క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి ఆ సమస్యని కళ్లారా చూసి సమస్య తీవ్రమైతే వెంటనే పై అధికారులతో మాట్లాడి నిధులు కేటాయించి ఆ సమస్యని పరిష్కరించేదాకా ఊరుకోరన్నారు. మున్సిపాలిటీ పరిధిలో మహేశ్వరం నియోజకవర్గం పైన, ప్రజల పైన అభివృద్ధి పైన అణువణువునా మానవత్వం కల కలిసి ఉంటుందన్నారు. సబితా ఇంద్రారెడ్డికి నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ సబితా ఇంద్రారెడ్డికి బ్రహ్మరథం పడతారన్నారు.