మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్
మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ :
ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను నిరంతరం కృషి చేస్తానని జగద్గిరిగుట్ట డివిజన్ మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలో జగద్గిరినగర్ లో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలు తెలుసుకోవడానికి బస్తీ ప్రజలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. తాను అధికారంలో ఉన్న లేకున్నా నిరంతరం డివిజన్ ప్రజలతో కలిసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. తాను కార్పొరేటర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాలను కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగిందని గుర్తు చేశారు. జగద్గిరినగర్. యుజీడీ సీసీ రోడ్లు తదితర మౌలిక వసతుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశానని తెలిపారు. జగద్గిరినగర్ లో చేపట్టవలసిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ డివిజన్ అధ్యక్షులు బొగ్గుల సురేష్, గణేష్, యాదగిరి నరసింహారెడ్డి, సతీష్, ప్రభాకర్, పద్మనాభం, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.