మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్
మన తొలివెలుగు: కుత్బుల్లాపూర్ ప్రతినిధి రమేష్
ప్రజా సమస్యల కోసం తాను నిరంతరం కృషి చేస్తానని జగద్గిరిగుట్ట డివిజన్ మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని న్యూ రాజీవ్ గాంధీ నగర్ లో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలు తెలుసుకోవడానికి బస్తీ ప్రజలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. తాను అధికారంలో ఉన్న లేకున్నా నిరంతరం డివిజన్ ప్రజలతో* కలిసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. తాను కార్పొరేటర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన నాటినుండి డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాలను కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. న్యూ రాజీవ్ గాంధీనగర్ లో యు జీ డీ, తాగునీరు, సీసీ రోడ్లు తదితర మౌలిక వసతుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశానని అన్నారు. మౌలిక వసతుల కల్పన అనేది నిరంతర ప్రక్రియ అని అన్నారు. న్యూ రాజీవ్ గాంధీ నగర్ లో చేపట్టవలసిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో న్యూ రాజీవ్ గాంధీనగర్ అధ్యక్షులు సాయిలు యాదవ్, ఆంజనేయులు సాగర్, భీమ్లా నాయక్, హనుమంతు యాదవ్, నాగేందర్, విటల్, మహేష్, పోచయ్య, సురేష్, కొండల్, రవికుమార్, మహేష్ యాదవ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.