MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 27 May 2026, 8:30 pm Posted by : MANA TOLIVELUGU

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

మన తొలివెలుగు: కుత్బుల్లాపూర్ ప్రతినిధి రమేష్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ లోని కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల సభ్యులు తదితరులు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా పలు సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. సానుకూలంగా స్పందించిన శంభీపూర్ రాజు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలియజేశారు.