ప్రతి డివిజన్, మండలాల్లో యూత్ వింగ్ నియామక ప్రక్రియను త్వరలోనే చేపడతాము. దరఖాస్తులు ఇవ్వండి

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య  మహేశ్వరం నియోజకవర్గంలోని ప్రతి డివిజన్, మండలాల్లో యూత్ వింగ్ నియామక ప్రక్రియను త్వరలోనే చేపడతామని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ అభివృద్ధికి కట్టుబడి పనిచేసే అర్హులైన నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. యువతకు రాజకీయంగా మరింత అవకాశాలు కల్పించి, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నియామకాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు,...