అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ :
ఈ నెల 24 నుండి జులై 25 వరకు జరిగే ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ సర్వేకు అందరు సహకరించాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు కోరారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శనివారం కేసరం గ్రామంలో సర్పంచ్ మనోహర అధ్యక్షతన జరిగిన గ్రామసభలో మండల ప్రత్యేక అధికారి జినుకల శ్యాంసుందర్, ఎంపీడీవో దినకర్, మండల విద్యాధికారి రంగరాజన్, వైద్యాధికారి యామిని, వ్యవసాయ అధికారి మల్లేష్, హౌసింగ్ అధికారి రామచందర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచాలన్నారు. సేంద్రీయ వ్యవసాయం చేయడం కలిగే ప్రయోజనాలను రైతులకు, ప్రజలకు వివరించారు.