మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
ఈనెల 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్న సందర్భంగా తెలంగాణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జాతీయ కౌన్సిల్ సభ్యులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్, రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పంతంగి రాజ్ భూపాల్ గౌడ్, మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్ అందెల శ్రీరాములు , మాజీ జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి హాజరై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజలు భారీ బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, వివిధ మండలాల అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు వివిధ మోర్చా నాయకులు పాల్గొన్నారు.