MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 7:32 pm Posted by : MANA TOLIVELUGU

ప్రధాన రహదారిపై మురుగునీరు 

మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట ప్రతినిధి శైలేష్ కుమార్ :

కందికల్ గేట్ ఫ్లైఓవర్ ప్రధాన రహదారిపై డ్రైనేజీ సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇప్పటికే రోడ్డు మధ్యలో మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన, వెదజల్లుతుంది. వర్షాలు పడితే పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీలు పూర్తిగా పొంగి మురుగునీరు ఇళ్లలోకి, షాపుల్లోకి చేరుతోంది. రోడ్డు మొత్తం మురికి నీరు చెరువులా మారి వాహనాలు నడపడం కష్టంగా మారింది. వాహనదారులు, పిల్లలు, వృద్ధులు జారిపడి, గాయపడే ప్రమాదం ఎక్కువగా ఉంది. మురుగునీరు నడిచే వారిపై చిల్లడం జరుగుతుంది. వర్షాకాలం మొదలయ్యే ముందే డ్రైనేజీ వ్యవస్థను శుభ్రం చేయాలి. పాడైన పైపులను మార్చి, ఉపశమనంగా రోడ్డుపై బ్లీచింగ్ పౌడర్ చల్లాలని ప్రజలు కోరుతున్నారు. హెచ్ ఏం డబ్ల్యూఎస్ ఎస్బీ, జీహెచ్ఏంసీ అధికారులు ఇప్పటికైనా స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.