MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 08 June 2026, 7:27 pm Posted by : MANA TOLIVELUGU

ప్రపంచ దిగ్గజాలకు విశ్వాసం కలిగేలా ఫ్యూచర్ సిటీ

కాలుష్యం లేని మహానగరంగా కొత్తపట్టణం నిర్మిస్తాం

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :

ప్రపంచ దిగ్గజాలకు విశ్వాసం కలిగేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం కాబోతుందని, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. మీర్ పేట, నందిహిల్స్, జిల్లెలగూడ, బడంగ్ పేట, నాదర్ గుల్, బాలాపూర్ డివిజన్ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో మల్లాపూర్ లోని వై ఏ ఆర్ ఫంక్షన్ హాల్ లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈనెల 10న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ స్కిల్ యూనివర్శిటీ భవనాలను ప్రారంభించనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కాంగ్రెస్ శ్రేణులను కేఎల్ఆర్ కోరారు. ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలకు నమ్మకం కలిగేలా ఫ్యూచర్ సిటీని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. కాలుష్యం లేని మహానగరంగా మార్చేందుకు గ్రీన్ ఫార్మా, పర్యావరణహితమైన సంస్థలకే అనుమతులు ఇస్తున్నట్లు కిచ్చెన్నగారు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గానికి మైలురాయి కానున్న ఫ్యూచర్ సిటీలో జరిగే సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలని కేఎల్ఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ ఛైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి, ఎలిమేటి అమరేందర్ రెడ్డి, సామిడి గోపాల్ రెడ్డి, సిద్దాల దశరథ సహా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.