ప్రభుత్వం విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత

ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జంగిటి రవీందర్ ప్రభుత్వం విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డి గూడెంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ముఖ్యంగా వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావడం...