MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 8:34 pm Posted by : MANA TOLIVELUGU

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బ్యాగుల పంపిణీ 

మన తొలివెలుగు, ఇబ్రహీంపట్నం ప్రతినిధి సీహెచ్ రాజు : 

యాచారం మండల పరిధిలోని చౌదర్ పల్లి, యాచారం, నంది వనపర్తి, అయ్యావారి గూడ, నజ్దిక్ సింగారం గ్రామాలలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎన్ఎన్ఆర్ యువసేన వ్యవస్థాపకులు నాయిని నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచితంగా స్కూల్ బ్యాగులు, నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో ఈ విద్యా సామాగ్రిని అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాయిని నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడం ప్రతి ఒక్కరి బాధ్యతని, తమ సంస్థ తరపున విద్యార్థుల ఉన్నత చదువులకు ఎల్లప్పుడూ తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. ఎన్ఎన్ఆర్ యువసేన గతంలోనూ మండలంలో కేంద్రంలో రక్తదాన శిబిరాలు, వేసవి చలివేంద్రాలు వంటి ఎన్నో ప్రజా ఉపయోగకర కార్యక్రమాలను నిర్వహించి స్థానికుల మన్ననలు పొందారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్ లు రాజుగౌడ్, మస్కు అనిత శరణం, విజయ్ కుమార్, నక్క అలివేలు వెంకటేష్ యాదవ్, బోడ కృష్ణ, ఆయా గ్రామల వార్డ్ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, ఎన్ఎన్ఆర్ యువసేన సభ్యులు కొమ్ము సురేష్, అమీర్ పేట రాజు, మద్దూరి కృష్ణా రెడ్డి, ప్రభాస్, అల్తాఫ్, శివ, జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.