ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బ్యాగుల పంపిణీ
మన తొలివెలుగు, ఇబ్రహీంపట్నం ప్రతినిధి సీహెచ్ రాజు : యాచారం మండల పరిధిలోని చౌదర్ పల్లి, యాచారం, నంది వనపర్తి, అయ్యావారి గూడ, నజ్దిక్ సింగారం గ్రామాలలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎన్ఎన్ఆర్ యువసేన వ్యవస్థాపకులు నాయిని నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచితంగా స్కూల్ బ్యాగులు, నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో ఈ విద్యా సామాగ్రిని అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాయిని నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో...