ప్రభుత్వ బడుల పై కప్పుల మరమ్మతులు పూర్తి కాలేదు కేవలం గోడలకు రంగులు వేసి అంతా బాగుందని భ్రమ కల్పిస్తున్న విద్యాశాఖ అధికారులు
కనీస వసతులు లేని చోట డిజిటల్ విప్లవం ఎలా సాధ్యం మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘విద్యా వారోత్సవాలు’ కేవలం ప్రచార ఆర్భాటానికే పరిమితమయ్యాయని వర్కింగ్ ప్రెసిడెంట్ షర్ఫుద్దీన్ హమేద్ తీవ్రంగా విమర్శించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన విద్యాశాఖ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా షర్ఫుద్దీన్ హమేద్ మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు కనీస వసతులు లేక అల్లాడుతుంటే, ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనంతో రంగుల వేడుకలు చేయడం...