ప్రభుత్వ భూమిలో మైసా కన్స్ట్రక్షన్ కోసం అక్రమ రోడ్డు
విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి ఆకుల సతీష్ డిమాండ్ మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టి రమేష్ : పేట్ బషీర్‌బాద్ పరిధిలోని సర్వే నంబర్ 23లో ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని మైసా కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అప్రోచ్ రోడ్డుగా వినియోగిస్తున్నారనే అంశంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త ఆకుల సతీష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ అసెంబ్లీ పరిధిలోని పేట్ బషీర్‌బాద్...