ప్రభుత్వ రంగ సంస్థల ఉనికి కనుమరుగు..!

రోజుకో సంస్థ విలీనానికి శ్రీకారం.. ఉద్యోగుల్లో ఆందోళన మన తొలివెలుగు | ప్రత్యేక కథనం తెలంగాణ ప్రజలకు, రైతులకు, పారిశ్రామిక రంగానికి దశాబ్దాలుగా సేవలందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల ఉనికి రోజురోజుకూ కనుమరుగవుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకప్పుడు ప్రజా సేవలో కీలక పాత్ర పోషించిన సంస్థలు పాలకుల నిర్లక్ష్యం, సరైన నియామకాలు లేకపోవడం, ఆర్థిక సమస్యలు తదితర కారణాలతో బలహీనపడుతున్నాయని ప్రభుత్వ రంగ ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. పేదలకు, రైతులకు, పారిశ్రామిక రంగానికి అండగా నిలిచిన ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం.....