ప్రాపర్టీ టాక్సీలు తగ్గించండి అంటూ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి వినతి

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య  మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విపరీతంగా పెరిగిన ప్రాపర్టీ టాక్సీలపై వివిధ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఇటీవల జీహెచ్ఎంసీలో విలీనమైన ప్రాంతాలకు అనుగుణంగా టాక్సీల విధానం ఉండాలని, ప్రస్తుతం మీర్‌పేట్ మున్సిపల్ కార్పోరేషన్‌లో అధికంగా టాక్సీలు వసూలు చేస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో అమలవుతున్న విధానాన్నే తమ ప్రాంతంలో కూడా అమలు...