ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్రకృతిని పరిరక్షిద్దాం
లుక్స్ గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిక్షపతి యాదవ్ మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి పనిచేయాలని లుక్స్ గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిక్షపతి యాదవ్ పిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నారని ఆయన తెలిపారు. ఐక్య రాజ్య సమితి 1974లో ఈ దినోత్సవాన్ని ప్రకటించినప్పటి నుంచి పర్యావరణ సంరక్షణకు...