ఫార్మా సిటీ వద్దు.. ఫ్యూచర్ సిటీయే ముద్దు – కేఎల్ఆర్
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య మహేశ్వరం నియోజకవర్గ ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఫ్యూచర్ సిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలను మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్) తీవ్రంగా ఖండించారు. తుక్కుగూడ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. హరీష్ రావుకి వారి పార్టీకి రాజకీయంగా ఫ్యూచర్ లేకపోవచ్చు కానీ తెలంగాణ యువతకు, భావితరాలకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలనే సంకల్పంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నారని...