ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రాజకీయ మనుగడ కోసమే
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రూ.150 కోట్ల అవినీతి వ్యవహారం నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే మాజీ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని ప్రజలు భావిస్తున్నారని మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకుడు సామ మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాజీ మేయర్ దంపతులు సబితా ఇంద్రారెడ్డి ప్రమేయం ఉందని చేసిన వ్యాఖ్యలు సత్యదూరమైనవి, హాస్యాస్పదమైనవన్నారు. ఈ ఆరోపణలను బీఆర్ఎస్ పార్టీ తరపున తీవ్రంగా...