MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 10:44 am Posted by : MANA TOLIVELUGU

ఫోన్ ట్యాపింగ్ కేసులో చిగురింత పారిజాత నరసింహారెడ్డి దంపతులను విచారించిన సిట్ అధికారులు

మన తొలివెలుగు, సిటీ బ్యూరో ప్రతినిధి

ఫోన్ ట్యాపింగ్ కేసులో బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ చిగురింత పారిజాతను ఆమె భర్త నరసింహారెడ్డిని బంజారాహిల్స్ లో సిట్ అధికారులు విచారించారు. వారిద్దరి స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. ఫోన్ టాపింగ్ చేసిన కేసును వేగవంతం చేశారు. రెండో చార్జీ షీట్ దాఖలు చేశారు. 30 నిమిషాల పాటు వారిద్దరి స్టేట్మెంట్లను సిట్ అధికారులు రికార్డ్ చేశారు. బయటకు వచ్చిన అనంతరం మాజీ మేయర్ మాట్లాడుతూ.. 2022 ఏడాది నుండి ఎన్నికల సమయంలో మా ఇద్దరి ఫోన్లు ట్యాపింగ్ కి గురైనట్టు అధికారులు చెప్పారన్నారు. అధికారులు చెప్పేవరకు మా ఫోన్లు ట్యాపింగ్ కు గురైందన్న విషయం మాకు తెలియలేదన్నారు. భార్యా భర్తలిద్దరి ఫోన్లు ట్యాప్ చేయడం దురదృష్టకరమన్నారు. నిరంతరం ప్రజా సేవలో మమేకమై ఉండడంతో మా ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు గుర్తించలేకపోయామన్నారు. గత ప్రభుత్వంలో మహిళా నేత, మాజీ మంత్రి మాపై ఇంత కక్ష్యతో వారికి నియోజకవర్గం లో మేము పోటీగా ఉంటామని… దగ్గరుండి ఫోన్ ట్యాపింగ్ చేశారనే అనుమానం ఉందని తెలిపారు. ఎన్నికల సమయంలో మా కదలికలపై నిరంతరం నిఘా పెట్టేవారు. కానీ అది ట్యాపింగ్ చేసి అనే విషయం ఇప్పుడు గుర్తించామన్నారు. మేము చేసే కార్యక్రమాలకు అడుగడుగున అడ్డు పడేవారు.. మా వ్యూహాలను ముందే పసిగట్టి ఎవరెవరు మాతో కలసి పని చేయాలనుకుంటున్నారు వారికి బెదిరింపులు గురి చేసేవారు. మహేశ్వరం నియోజకవర్గంలో మమ్ముల్ని ఎదగకుండా అడ్డుకోవడానికి ఈ విధమైన చర్యలు చేపడతారని గుర్తించలేకపోయమన్నారు. సిట్ పై పూర్తి నమ్మకం ఉందన్నారు. రేవంతన్న ప్రభుత్వం తప్పకుండా మాకు న్యాయం చేస్తారని నమ్మకం ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలైన నిందితులకు త్వరలోనే శిక్ష పడుతుందనీ నమ్ముతున్నామన్నారు.