MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 8:47 pm Posted by : MANA TOLIVELUGU

ఫ్యూచర్ సిటీని సందర్శించిన కాంగ్రెస్ నేతలు

జూన్ 10న సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్భంగా ఏర్పాట్ల పరిశీలన

ప్రజలు భారీ ఎత్తున తరలిరావాలని పిలుపు 

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జూన్ 10న ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డెవలప్మెంట్ అథారిటీ, స్కిల్ యూనివర్సిటీల ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర ఐ.టి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి , మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీపీసీసీ మెంబర్ దేప భాస్కర్ రెడ్డి, బొక్క జంగారెడ్డి, ఏనుగు జంగారెడ్డి, ఇతర ముఖ్య నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 10న సాయంత్రం 4 గంటలకు ఫ్యూచర్ సిటీలో జరిగే సీఎం రేవంత్ రెడ్డి సభను జయప్రదం చేద్దామని పిలుపునిచ్చారు.

అనంతరం కేఎల్ఆర్ మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గానికే మణిహారం ఫ్యూచర్ సిటి మారబోతుందన్నారు. మహేశ్వరం నియోజకవర్గానికి మణిహారంగా నిలిచే భారత్ ఫ్యూచర్ సిటీకి ప్రజలంతా తరలిరావాలని మంత్రి శ్రీధర్ బాబు సహా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. 10న సాయంత్రం 4 గంటలకు ఫ్యూచర్ సిటిలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, స్కిల్ యూనివర్సిటీల ప్రారంభోత్సవాలను కనుల పండుగగా జరుపుకునేందుకు జనం, కాంగ్రెస్ శ్రేణులు స్వచ్ఛందంగా తరలిరావాలని కిచ్చెన్నగారు కోరారు. ఉద్యోగ, ఉపాధి ఇచ్చే స్కిల్ యూనివర్సిటీ – పాలన సౌలభ్యం కోసం నిర్మించిన ఫ్యూచర్ సిటి డెవలప్మెంట్ అథారిటీ భవనాలు అందుబాటులోకి రావటం ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా భావిస్తున్నట్లు కేఎల్ఆర్ తెలిపారు.