కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ ఎర్ర చంద్రమోహన్
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :
ఫ్యూచర్ సిటీ రాబోయే తరాలకు బంగారు బాటలు వేసే దివిటీ అని మహేశ్వరం నియోజకవర్గం సోషల్ మీడియా ఇంచార్జ్ ఎర్ర చంద్రమోహన్ స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీలో బుధవారం జరిగే సీఎం సభను విజయవంతం చేయడానికి మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు మహేశ్వరం నియోజకవర్గం నుంచి భారీగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలి రావాలని మహేశ్వరం నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ ఎర్ర చంద్రమోహన్ కోరారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు రాబోయే తరాలకు బంగారు భవిష్యత్తును అందించే దిశగా వేగంగా అడుగులు వేస్తోందన్నారు. ఫ్యూచర్ సిటీ తెలంగాణకే కాకుండా దేశానికే తలమానికంగా నిలిచే ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటుందన్నారు. డెవలప్మెంట్ అథారిటీ, స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుతో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. లక్షలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని, ఫ్యూచర్ సిటీ ఏర్పాటుతో తెలంగాణ దశ దిశ మారనుందని అన్నారు. ఫ్యూచర్ సిటీలో 10వ తేదీన సాయంత్రం 4 గంటలకు జరిగే సీఎం సభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయడం, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అని, మహేశ్వరం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.