డిప్యూటీ కమిషనర్ కు వినతి
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
బడంగ్‌పేట్ లోని రంగారెడ్డి జిల్లా లైబ్రరీలో సమస్యలను పరిష్కరించాలని నవ తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్ సమ్మయ్యను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. బడంగ్‌పేట్ లైబ్రరీలో ఇందిరమ్మ క్యాంటీన్, వాటర్ ఫిల్టర్, ముఖ్యంగా డ్రెనేజీ సమస్యలు ఉన్న నేపథ్యంలో వాటిని వెంటనే పరిష్కరించాలని డిప్యూటీకమిషనర్ ను కోరడం జరిగిందన్నారు. ఈ సమస్యలపై స్పందించిన డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఏఈ హరీష్ కి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఏఈ హరీష్ బడంగ్‌పేట్ లైబ్రరీని సందర్శించి డ్రెయినేజీ సమస్యను పరిశీలించి, శాశ్వత పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో నవ తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్ణగంటి రంజిత్ కుమార్, ప్రొగ్రెసివ్ యూత్ లీగ్ హైదరాబాద్ నగర కార్యదర్శి కొల్లూర్ బీమేశ్, క్రిష్ణ (కిట్టు), నర్సింహ గౌడ్, రమేష్, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.