మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట ప్రతినిధి శైలేష్ కుమార్ :
వర్షాకాలం నేపథ్యంలో నగరంలో నీటి ముంపు సమస్యలు తలెత్తకుండా హైడ్రా – మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఉప్పుగూడ పరిధిలోని హనుమాన్ నగర్ కాలనీలో హైడ్రా సిబ్బంది మ్యాన్‌హోళ్లు, మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్త, పూడికను తొలగిస్తున్నారు. బురదను ఎత్తి కాలువల్లో నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టారు. వర్షాలు పడినప్పుడు రోడ్లపై నీరు నిలిచిపోకుండా ముందస్తుగా, ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కాలనీల వారీగా పూడిక తీత పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని హైడ్రా సిబ్బంది వెల్లడించారు. ఈ సందర్భంగా స్థానికులు హైడ్రా చొరవను అభినందించారు.