బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మన తొలివెలుగు ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : అనారోగ్యంతో మృతిచెందిన శనాయిపల్లి గ్రామానికి చెందిన సత్యం కుటుంబాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మంగళవారం పరామర్శించారు. వారి నివాసానికి వెళ్లిన ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిస్తూ ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు శివరాంరెడ్డి, సుధాకర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, ఖాజా, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.