బిజినపల్లిలో 111 బస్తాల నకిలీ డీఏపీ స్వాధీనం
రంగంలోకి కలెక్టర్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ కర్ణాటక ముఠా పనేనని అనుమానం మన తొలివెలుగు, ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో ప్రతినిధి ఎన్. హరీష్ : బిజినపల్లి మండలంలోని మహదేవునిపేట గ్రామంలో భారీగా నిల్వ ఉంచిన 111 బస్తాల నకిలీ డీఏపీ ఎరువులను వ్యవసాయ, పోలీస్ అధికారులు ఆకస్మిక తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ గురువారం సంఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. కర్ణాటకకు చెందిన కొందరు వ్యక్తులు మార్కెట్ ధర కంటే తక్కువగా బస్తా...