MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 8:26 pm Posted by : MANA TOLIVELUGU

బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలి 

ప్రతి గ్రామం, ప్రతి బస్తీలో బీఆర్ఎస్ జెండా రెపరెపలాడేలా కృషి చేయాలి

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్  :

మాజీ మంత్రి, ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డిని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సామ మహేందర్ రెడ్డి, బడంగ్ పేట్ వాసి తీగల రాఘవేందర్ రెడ్డితో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో మహేశ్వరం నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయిలో కార్యకర్తల సమన్వయం, ప్రజా సమస్యలు రానున్న రాజకీయ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ప్రజల ఆశయాలకు ప్రతీక అని, తెలంగాణ ఆత్మగౌరవ పరిరక్షణ కోసం పార్టీ ఎప్పటికీ రాజీపడదని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రతి గ్రామం – ప్రతి బస్తీలో బీ ఆర్ ఎస్ జెండా రెప రెపలాడేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కార్యకర్తలే బీఆర్ఎస్‌కు వెన్నెముక అని పేర్కొంటూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి మరింత దూకుడుగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో బి ఆర్ ఎస్ పార్టీని మరింత శక్తివంతంగా నిర్మించి ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలన్నారు.