MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 9:39 pm Posted by : MANA TOLIVELUGU

బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి  

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిదీ రాజకీయ కోణంలో ఆలోచించకుండా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండల కేంద్రంలోని మహేశ్వరం రోడ్డు నుండి సిరిగిరిపురం గ్రామం వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిధులు సి ఆర్ ఆర్ నుండి మంజూరైన రూ. 60 లక్షలతో నిర్మిస్తున్న బిటి రోడ్డు నిర్మాణ పనులను డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. సిరిగిరిపురం గ్రామంలో చాలా రోజులుగా ఈ రోడ్డు అభివృద్ధి కావాలని ఉండేదని సదరు కాంట్రాక్టర్ చాలా రోడ్లు కాంట్రాక్టు తీసుకోవడం వల్ల ఒక్కొక్క రోడ్డు వేస్తూ ఈ రోడ్ కి వచ్చే సరికి ఎన్నికల కోడ్ రావడంతో పనులు డిలే అయ్యిందన్నారు, గత రెండు సంవత్సరాలుగా ఎంతో ప్రయత్నం చేస్తూ అధికారులను సమన్వయం చేస్తూ వస్తే ఇప్పుడు సాధ్యమైందని, 2 సంవత్సరాలుగా ఏది అడిగిన చివరికి రోడ్ల రిపేర్లు అడిగిన రాష్ట్ర ప్రభుత్వం పెట్టమని అంటున్నారని, అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పనులు వివిధ కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా ఒకే కాంట్రాక్టర్ కు ఇస్తే పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని, ప్రతి దాంట్లో రాజకీయ కోణంలో ఆలోచించకుండా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పని చేయాలన్నారు, శ్రీశైలం హైవే చాంద్రాయణగుట్ట నుండి తుక్కుగుడా వరకు రూ. 84 కోట్లు మంజూరయ్యవని, తుక్కుగుడా నుండి ఇంకా ముందుకు ఇప్పుడున్న రోడ్డు కు రెండింతల రోడ్డు వైండింగ్ చేయాలన్నారు, ఫ్యూచర్ సిటీ రోడ్ అడ్డం పెట్టుకుని శ్రీశైలం రోడ్డును అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు, ఫ్యచర్ సిటీ కి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఎంత అవసరమో శ్రీశైలం హైవే తమకు అంత అవసరమన్నారు.

ఈ కార్యక్రమంలో సిరిగిరి పురం సర్పంచ్ కృష్ణవేణి శ్రీనివాస్, మహేశ్వరం సర్పంచ్ మునగపాటి నవీన్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ డి వెంకటేశ్వర్ రెడ్డి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ పోతర్ల అంబయ్య యాదవ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్రోల్ల చంద్రయ్య ముదిరాజ్, ఐ నర్సింహ గౌడ్, వెంకటేష్ యాదవ్, వెంకట్ రాజిరెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ఆదిల్ అలీ, పిఎసిఎస్ డైరెక్టర్ కాడమోని ప్రభాకర్, ఉప సర్పంచ్ తడకల నాగరాణి మహేష్,బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బండ నర్సింహ, వార్డు సభ్యులు ఆవ జంగమ్మ బీరప్ప, బండ స్వప్న నర్సింహా, కౌలోజి సత్యనారాయణ, గండికోట ఈదయ్య, గండికోట బాబు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు..