MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 7:16 am Posted by : MANA TOLIVELUGU

బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో లలో బీజేపీ ఘన విజయం – బాలాపూర్ లో బీజేపీ నాయకుల సంబరాలు

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలోని బాలాపూర్ చౌరస్తాలో బీజేపీ మాజీ కార్పొరేటర్ ఎడ్ల మల్లేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో లలో బీజేపీ ఘన విజయం, తమిళనాడు లో సనాతన ధర్మ ద్రోహి డి ఎం కే పార్టీ ఓటమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మిఠాయిలు పంచుతూ , బీజేపీ జిందాబాద్.. జై మోదీ జీ.. అంటూ టపాకాయలు కాల్చారు. ఈ సందర్భం గా రాష్ట్ర బీజేపీ కన్వీనర్ కో ఆపరేటివ్ సెల్ అధ్యక్షుడు కొలను శంకర్ రెడ్డి , ఎడ్ల మల్లేష్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ప్రజలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని, వారి పై పూర్తి విశ్వాసంతో ఉన్నారని అన్నారు. అందుకే ఈ ఘన విజయాలు అన్నారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. దక్షిణ భారత దేశంలో బీజేపీ రోజు రోజు కు బలోపేతం అవుతుందని తెలిపారు. పార్టీ ని ఆదరించిన రాష్ట్రాల ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమములో బీజేపీ నేతలు మాజీ కార్పొరేటర్ కిషోర్, జిల్లెల ప్రభాకర్ రెడ్డి , శశిధర్, భూషణం, దాసు, విజయకుమార్, అరుణ జీ, సూర్యప్రకాష్ సింగ్, జయకాంత , రాఘవేంద్ర , రాజేష్ రెడ్డి, ఎస్ భాస్కర్, భూమన తదితరులు పాల్గొన్నారు.