MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 18 June 2026, 6:32 pm Posted by : MANA TOLIVELUGU

బొడ్రాయికి గ్రామ పెద్దలు ప్రత్యేక పూజలు

25న బొడ్రాయి పండుగ మహోత్సవాలను ఘనంగా నిర్వహించబోతున్నాం

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :

బొడ్రాయి పండుగ మహోత్సవాలను ఈ నెల 25వ తేదీన నిర్వహించబోతున్న సందర్భంగా బొడ్రాయి ప్రతిష్ఠాపన విగ్రహాన్ని గ్రామస్థులు భారీ ఊరేగింపుగా బాలాపూర్ గ్రామానికి తీసుకువచ్చారు. బొడ్రాయి పండుగకు సంబంధించిన నాభిశిల గ్రామానికి చేరుకున్న సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన స్థానిక నాయకులతో కలిసి మాజీ వైస్ ఛైర్మెన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిగురింత నర్సింహ్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఈ సందర్భంగా చిగిరింత నరసింహరెడ్డి మాట్లాడుతూ. ఈ నెల 25వ తేదీన బాలా పూర్ గ్రామంలో బొడ్రాయి పండుగ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి భారీ సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బండ్లగూడ ఖల్సా సింగిల్ విండో ఛైర్మెన్ సింగిరెడ్డి పెంటారెడ్డి, బీజేపీ కో- ఆపరేటివ్ సెల్ రాష్ట్ర కన్వీనర్ కొలన్ శంకర్రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వంగేటి లక్ష్మారెడ్డి, మాజీ కో- ఆప్షన్ సభ్యుడు గుండోజు రఘునందన్ చారి, మాజీ కార్పొరేటర్ వంగేటి లక్ష్మారెడ్డి, మాజీ వార్డు సభ్యుడు కళ్లెం ఎల్లారెడ్డి, మాజీ సింగిల్ విండో డైరెక్టరు చిగురింత పెద్దనర్సింహ్మారెడ్డి, నాయ కులు అంజ బాలరాజ్, ఎర్ర జైహింద్ కమార్, పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మేకల సంజీవ, గిర్కటి కృష్ణంరాజుగౌడ్, సుధాకర్ రెడ్డి, జోరల ప్రభాకర్, కోటగిరి మురళి పాల్గొన్నారు.