MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 7:42 pm Posted by : MANA TOLIVELUGU

బ్యాండ్ కళాకారుల రాష్ట్ర సదస్సు గోడపత్రిక ఆవిష్కరణ 

ఆవిష్కరించిన మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ 

బ్యాండ్ కళాకారుల న్యాయమైన డిమాండ్లకు సంపూర్ణ మద్దతు 

మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ :

బ్యాండ్ కళాకారుల న్యాయమైన డిమాండ్ల కు తన మద్దతు ఎల్లవేళలా ఉంటుందని జగద్గిరిగుట్ట డివిజన్ మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ అన్నారు. ఈనెల 16వ తేదీన సుందరయ్య కళా నిలయంలో నిర్వహించనున్న బ్యాండ్ కళాకారుల రాష్ట్ర సదస్సు వాల్ పోస్టర్ ను గురువారం మాజీ కార్పొరేటర్ నివాస కార్యాలయంలో బ్యాండ్ కళాకారులు, యజమానుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. వివాహ మరియు ఇతర శుభకార్యలతో పాటు వివిధ బోనాల పండుగ తదితర శుభకార్యాలే కాకుండా అంతిమయాత్ర లాంటి ప్రతి కార్యక్రమాలలో బ్యాండ్ కళాకారులు నిత్యవసరంగా మారారని అన్నారు. నిత్యం ప్రజలలో మమేకమై వారి శుభకార్యాలకు ఇతర కార్యక్రమాలకు ఉపయోగపడుతున్న బ్యాండ్ కళాకారుల పట్ల పోలీసులు అక్రమ కేసులు బనాయించడం సరైనది కాదని అన్నారు. ముఖ్యంగా వారి ప్రధాన డిమాండ్ లైన పోలీస్ కేసులు, బ్యాండ్ సీజ్ చేయడం, శద్ధ కాలుష్యం లాంటి పై కేసులు, తదితర డిమాండ్లను వెంటనే ప్రభుత్వం అంగీకరించి వారికి మద్దతుగా నిలవవలసిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొలుకుల జైహింద్, బ్యాండ్ కళాకారుల సంఘం Hasn’t ప్రెసిడెంట్ రాచర్ల శేఖర్, ఉపాధ్యక్షులు, మైముద్, కాజ మియా హరీష్, గోపాల్, నాగేందర్, గణేష్, కాశయ్య, గిరీష్, రహీం, హరీష్, బసవరాజ్, దానయ్య తదితరులు పాల్గొన్నారు.