మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించండి
జలమండలి అధికారులకు చింతల రవి కుమార్ గుప్త వినతి మన తొలివెలుగు, ఎల్బీనగర్ ప్రతినిధి వనస్థలిపురం డివిజన్ పరిధిలో నెలకొన్న తీవ్రమైన మంచినీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ వనస్థలిపురం డివిజన్ అధ్యక్షులు చింతల రవి కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జలమండలి డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం) నాగరాజు కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చింతల రవి కుమార్ మాట్లాడుతూ.. వనస్థలిపురం డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో తాగునీటి సరఫరా సక్రమంగా జరగకపోవడం, తక్కువ...