MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 28 May 2026, 11:57 am Posted by : MANA TOLIVELUGU

మన తొలివెలుగు ఎఫెక్ట్

మన తొలివెలుగు పత్రికకు స్పందన

 

నడుములు విరగొట్టే గుంతలు . యమ డేంజర్ గా మారిన రహదారికి తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టిన జీహెచ్ఎంసీ అధికారులు

 

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

 

మన తొలివెలుగు దినపత్రికలో ప్రచురితమైన వివిధ సమస్యల కథనాలపై అధికారులు సానుకూలంగా స్పందించి, తక్షణ పరిష్కార చర్యలు చేపట్టిన సంఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా మన తల్లి వెలుగు పత్రికకు విశేష స్పందన లభిస్తుంది. ప్రజా సమస్యలపై మన తొలివెలుగు దినపత్రిక ప్రత్యేక చొరవ తీసుకుంటుంది. ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుంది.

 

“నడుములు విరగొట్టే గుంతలు” . యమ డేంజర్ గా మారిన రహదారినీ ఎవరు పట్టించుకోరు.. మా బాధ ఎవరికి చెప్పుకోవాలనే ప్రయాణికుల కష్టాలను, రహదారి సమస్యను ఇటీవల మన తొలివెలుగు పత్రికలో ప్రచురించడం జరిగింది. జల్ పల్లి సర్కిల్ పరిధి కేంద్రంలోని జల్ పల్లి, శ్రీరామ కాలనీ చౌరస్తా నుంచి లక్ష్మీ గూడ మైలార్ దేవ్ పల్లి కి వెళ్లే రూట్ లో ప్రెస్ కాలనీ వద్ద ప్రధాన రహదారి రోడ్డు అధ్వానంగా ఉండడంతో ప్రయాణికుల కష్టాలు వర్ణణాతీతంగా ఉండేది. మన తొలివెలుగు పత్రికలో ప్రచురించడంతో స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు తాత్కాలికంగా రహదారికి మరమ్మత్తులు చేశారు. ప్రస్తుతం ప్రయాణికులు హర్షం వ్యక్తం చేసినప్పటికీ తాత్కాలిక మరమ్మత్తులు మున్నాళ్ళ ముచ్చటే అని వాపోతున్నారు. మళ్లీ వారం రోజుల్లో గా యధావిధిగా మారుతుందని మళ్లీ ప్రయాణికులు కష్టాలు మొదటికీ వస్తాయని కావున నిధులు కేటాయించి సీసీ రోడ్డు ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.