మహిళా భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా తప్పుడు వాగ్దానాలతో కాలం వెళ్ళబుచ్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం - సబితా ఇంద్రారెడ్డి మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సరూర్‌నగర్ డివిజన్ పరిధిలో నూతనంగా నిర్మించిన మహిళా భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళల అభివృద్ధి, సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మహిళలకు ఆర్థిక, సామాజిక పరంగా మరింత బలాన్ని...