MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 7:30 pm Posted by : MANA TOLIVELUGU

మహేశ్వరం నియోజవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న అభివృద్ధి ప్రదాత సబితా ఇంద్రారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహేశ్వరం ముద్దుబిడ్డ మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అని మాజీ కార్పోరేటర్ ఎనుగుల అనిల్ కుమార్ యాదవ్ కొనియాడారు.

జీహెచ్ఎంసీ మీర్ పేట్ 60 వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్ ఎనుగుల అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహేశ్వరం ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి జన్మదినం సందర్భంగా వివేకానంద చౌరస్తా జిల్లేలగూడ లో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జన్మదిన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబితమ్మ అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళలు నాయకురాళ్ళు సబితా ఇంద్రారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి సేవలను అందరూ గుర్తు చేసుకోవడం జరిగింది. మన మహేశ్వరం నియోజకవర్గానికి సబితా ఇంద్రారెడ్డి నాయకత్వం వహించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం లో మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ మాజీ ప్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, మాజీ పార్టీ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి, జిల్లెలగూడ మాజీ ఎంపీటీసీ ఎనుగుల అనిత అనిల్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు సిద్ధాల లావణ్య బీరప్ప, ధనలక్ష్మి రాజకుమార్, గడ్డమీది రేఖ లక్ష్మణ్ ముదిరాజ్, సిద్దాల పద్మ అంజయ్య, కాంటెస్ట్ కార్పోరేటర్లు బొమ్మ కంటి దయానంద్ ముదిరాజ్, అబ్బనమొని గోపి యాదవ్, సిరుర్ బాల్ రాజ్, తెరేటిపల్లి శ్రీనివాస్ గుప్త, మాజీ టెంపుల్ డైరెక్టర్లు, మేకల యాదగిరి, సుర్వి లత శేఖర్ గౌడ్ , జ్ఞానేశ్వర్ చారి, మాజీ కోఆప్షన్ సభ్యులు స్నేహలత, గ్రంథాలయ మాజీ డైరెక్టర్ పంతంగి మాధవి, పార్టీ మహిళా అధ్యక్షురాలు జమల్ పూర్ సునీత బాలరాజ్, ఐతరాజు వెంకటేష్, బీఆర్ఎస్వి నాయకులు పుప్పాల సాయి చరణ్, సీనియర్ నాయకులు బిందు గీత, లప్ప లక్ష్మణ్, తొలుసూరి నర్సింహా యాదవ్, మేకల కృష్ణ ముదిరాజ్, సత్యం, కడమంచి నర్సింహ్మ, తోటకూరి నాగరాజుయాదవ్ , చందు శివకృష్ణ ముదిరాజ్, ధారల మధు, వెంకట్ రెడ్డి, కైలాసం, యాదగిరి రెడ్డి, జగల్ రెడ్డి, రూప్ కరన్ కార్యకర్తలు, సబితమ్మ అభిమానులు పాల్గొన్నారు.