మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం కాలిపోయిన ఇంటికి యువత సాయం
ఆర్థిక సహాయం చేసి కుటుంబాన్ని ఆదుకున్న యువత అండగా నిలిచి మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్ ప్రశంసించిన గ్రామస్తులు మన తొలివెలుగు, తెలంగాణ బ్యూరో / మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం చండూరు మండల పరిధిలోని దోని పాముల గ్రామంలో ఇల్లు కాలిపోయి నిరాశ్రయులైన నిరుపేద కుటుంబానికి గ్రామ యువత మానవత్వంతో అండగా నిలిచారు. దోనిపాముల గ్రామంలో అన్నేపాక మహేందర్ తండ్రి బజారు ఇళ్ళు (గుడిసె) ఈనెల 6న కరెంట్ షాక్ సర్క్యూట్ వల్ల మంటలు వచ్చి గుడిసె...